నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మహబూబ్ ఘాట్ రెండో సెక్షన్ దగ్గరు కారు లోయలోపడింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో దారి కనిపించడం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఆదివారం(జూలై21) తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు సురక్షితంగా రక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు Dail 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తం అయిన నిర్మల్ DCRB ఇన్స్పెక్టర్ గోపినాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ స్పాట్ వెళ్లారు. లోయలో పడిన కారును గుర్తించి అందులో ఉన్న ముగ్గురు రాధాకృష్ణ, ఆయన భార్య కుమారుడిని బయటికి తీసుకొచ్చారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వారుగా గుర్తించారు. చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. సకాలంలో స్పందించి బాధితులను కాపడిన నిర్మల్ DCRB ఇన్స్పెక్టర్ గోపినాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్ నిర్మల్ ఎస్పీ డా. జానకీ షర్మిల అభినందించారు.