బైక్‌‌ను ఢీకొట్టిన కారు, యువకుడు మృతి

జైపూర్ (భీమారం), వెలుగు : బైక్‌‌ను కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా భీమారంలో బుధవారం జరిగింది. జైపూర్ మండలంలోని రసూల్‌‌పల్లికి చెందిన ఆకుదారి మల్లేశ్‌‌ (28) భీమారంలో ఉంటూ పొల్లంపల్లిలోని స్కూల్‌‌ బస్‌‌ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌‌పై స్కూల్‌‌కు వెళ్తుండగా భీమారంలోని పెట్రోల్‌‌ బంక్‌‌ సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో మల్లేశ్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మల్లేశ్‌‌ను హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన వారు కారును అక్కడే వదిలేసి పరార్‌‌ అయ్యారు. జైపూర్ ఏసీపీ, శ్రీరాంపూర్ సీఐ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.