భైంసా వెలుగు : ఓ ఆర్ఎంపీ వైద్యుడు 40 ఏండ్లుగా సైకిల్‌పైనే వైద్య సేవలు అందిస్తున్నాడు. కాలం మారినా ఆయన మాత్రం తన పంథాను మార్చుకోలేదు. దివ్యాంగుడైనప్పటికీ రోజు దాదాపు 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఊరూరా తిరుగుతూ వైద్యం అందిస్తున్నారు.
భైంసాకు చెందిన ఆర్ఎంపీ దొడ్లోళ్ల సత్యనారాయణ(60). మండలంలోని కోతుల్గాం, బిజ్జూర్, ఎగ్గాం, చింతల్బోరి, మాటేగాం తదితర గ్రామాలకు సైకిల్‌పైనే వెళ్తూ పేదలకు తక్కువ ఫీజుతోనే వైద్య సేవలు చేస్తూ అందరికి ఆత్మీయుడయ్యారు.