భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నవంబర్ 29న రేట్లు ఇవే..

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. నవంబర్ 29 (శుక్రవారం) నాడు 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారంపైన రూ.760, 22 క్యారెట్ల గోల్డ్ పైన రూ.670 పెరిగింది. ప్రస్తుతం తులం (10 గ్రాముల) బంగారం రూ.78,110 కి చేరింది. అటు కిలో వెండి మీద కూడా రూ.2వేలు పెరిగింది. ఈరోజు కిలో వెండి రూ.91,500లుగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం రూ78 వేల 110, 22 క్యారెట్ల గోల్డ్ 71 వేల 600గా ఉంది. నవంబర్ 28న (గురువారం) 22 క్యారెట్ల గోల్డ్ రూ.70వేల930 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.77 350లుగా ఉంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గిన బంగారం వెండి ధరలు.. ఇప్పుడు వరసగా పెరుగుతూ పోతున్నాయి. 

ALSO READ : ఒకేరోజు 4900 తగ్గినా వెండి ధర