ఆడుకుంటూ పట్ట గొలుసు మింగింది! : ప్రాణాపాయ స్థితిలో చిన్నారి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు:  పట్ట గొలుసు మింగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన చిన్నారిని రిమ్స్ డాక్టర్లు  కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన సత్యపాల్ కూతురు ధృతి (7 నెలలు) బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూ.. తన కాలి పట్ట గొలుసు తీసుకుని నోట్లో పెట్టుకుని మింగింది. వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు రిమ్స్ కు తీసుకెళ్లారు. అప్పటికే పాపకు శ్వాస ఆడక నీరసించింది.  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడి హేమంత్ రావు కు డ్యూటీ డాక్టర్ సమాచారం ఇవ్వగా వచ్చారు. ఎండోస్కోపీ ద్వారా  తో పాప గొంతులో ఇరుక్కుపోయిన పట్ట గొలుసు బయటకు తీశారు. దీంతో చిన్నారి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. పసిపాపను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడడంతో డాక్టర్లను అభినందించారు.