Reserve Bank of India: ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా, 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ IAS అధికారి. శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం(డిసెంబర్ 10, 2024)తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మల్హోత్రాను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. మల్హోత్రా ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంజయ్ మలోత్రా మూడేళ్ల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవిలో కొనసాగనున్నారు. ఈయన.. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా ఉన్నారు. అంతుకుముందు భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు.