గురువారం ఐలాపూర్​లో నిర్మాణాల నిలిపివేత

  • నేడు విచారించనున్న అడిషనల్ కలెక్టర్

సంగారెడ్డి (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం ఐలాపూర్​లో కొనసాగుతున్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం నిలిపివేశారు. సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున నిర్మాణాలు చేయకూడదని తెలిపారు. నిర్మాణాలకు కోర్టు అనుమతి ఉందని బాధితులు ఆర్ఐతో వాదించడంతో ఆయా పత్రాలు తహసీల్దార్​కు అందజేయాలని కోరారు.

అప్పటివరకు పనులు చేయకూడదని హెచ్చరించారు. అయితే, ఈ భూ వివాదాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఈ నెల 5న అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్​ విచారణ చేపడతారని  బాధితులకు తెలిపారు.
ALSO Read : బొగ్గు బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు : ఐఎన్టీయూసీ