ఈవో మోహన్​రెడ్డికి సన్మానం

పాపన్నపేట,వెలుగు: ఉద్యోగులకు రిటైర్మెంట్​అనేది సర్వసాధరణమని ఏడుపాయల పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్ అన్నారు.శుక్రవారం ఏడుపాయల ఆలయ ఈవో మోహన్ రెడ్డి రిటైర్మెంట్ ​సన్మాన సభ కార్యక్రమాన్ని  గోకుల్ షెడ్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్​ మాట్లాడుతూ.. ఆలయాల ఉద్యోగ నిర్వహణ అనేది గొప్పవరమన్నారు. ఈవో మోహన్ రెడ్డి సౌమ్యుడిగా అందరి మన్ననలు పొందారని అభినందించారు. అనంతరం ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడుపాయల ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 

అందరి సహకారంతో ఆరేళ్ల పాటు పని చేశానని అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అయ్యానన్నారు. ఈ సందర్భంగా పాలకమండలి చైర్మన్, ధర్మకర్తలు, సిబ్బంది ఆయనని సన్మానించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ చైర్మన్లు ​నర్సింలు గుప్తా, వెంకటేశ్వర్​రెడ్డి, నర్సింలుగౌడ్​ పాల్గొన్నారు. 
 

ఏడుపాయల ఈవోగా వినోద్​రెడ్డి
 

ఏడుపాయల ఆలయ కార్య నిర్వహణ అధికారిగా వినోద్ రెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.  దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన వినోద్ రెడ్డిని ఏడుపాయల ఇన్​చార్జి ఈవోగా నియమించారు. వినోద్ రెడ్డి గతంలో బాసర, సికింద్రాబాద్ గణేశ్ ఆలయాల్లో పనిచేశారు. ప్రస్తుతం కొండగట్టు జాతర జరుగుతున్న దృష్ట్యా జాతర ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ గా వినోద్ రెడ్డి విధుల్లో ఉన్నారు. కొండగట్టు జాతర ముగిసిన అనంతరం ఏడుపాయల ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.