బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్ సభ బరిలో ఓ రిటైర్డ్ ఐపీఎస్, ఓ మాజీ ఐఏఎస్

బీఆర్ఎస్ పార్టీ నేడు రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారిలో ఒకరు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ వెంకట్రాం రెడ్డిలకు ఎంపీ టికెట్లు కేటాయించారు.  నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రాం రెడ్డిని లోక్ సభ పోటీలోకి BRS పార్టీ దింపింది. 

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బీఎస్పీకి రాజీనామ చేసీ బీఆర్ఎస్ లో చేరారు. వెంకట్రాం రెడ్డి గతంలో మెదక్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా, మెదక్ ఇంచార్జి కలెక్టర్ గా పనిచేశారు. ఇప్పటివరకు 13 మందిని MP అభ్యర్థులుగా ప్రకటించారు. భువ‌న‌గిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైద‌రాబాద్ ఎంపీ స్థానాల‌కు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. 

Also Read :బెయిల్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టులో కవితకు బిగ్ షాక్