బెల్లంపల్లి, వెలుగు: లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి, మేము సైతం ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి మండలంలోని లంబడితండాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 100 మందికి పైగా రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కట్కూరి సత్యనారాయణ తెలిపారు.
22 మందికి బెల్లంపల్లి లయన్ కంటి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేనున్నట్లు పేర్కొన్నారు. ఐ స్పెషలిస్ట్కె.అంజయ్య, జనని హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ పూజిత సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. లయన్స్ క్లబ్ సెక్రెటరీ పైడాకుల రాజన్న, ట్రెజరర్ ఆదర్శ్ వర్ధన్ రాజు, జోన్ చైర్ పర్సన్ కుడికాల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.