ఫండ్స్​ మంజూరు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వినతి

కోల్ బెల్ట్ / కోటపల్లి: కోటపల్లి మండలం దేవులవాడ, అన్నారం, సిర్ష, జనగామలో మంగళవారం  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా  దేవుల వాడ గ్రామస్తులతో ఆయన మాట్లాడారు.   గ్రామస్తులు రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణం కోసం రు. 30లక్షల ఫండ్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కు  వినతి పత్రం అందచేశారు.

చెన్నూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కాలేజీ లో  సమస్య లపై వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట చెన్నూరు టౌన్, రూరల్ సీఐ  లు రవీందర్, సుధాకర్, కోటపల్లి ఎస్ ఐ రాజందర్, అగ్రికల్చర్ మండల ఆఫీసర్ ప్రేమాకుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ  పీఏసీఎస్ చైర్మెన్ గోడిసెల బాపు రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోటు రామి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ రాజమల్ల గౌడ్, హిమావంత్ రెడ్డి, పోటు శ్రీనివాస్ రెడ్డి, తనుగుల రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.