వివేక్​ వెంకటస్వామి ఆదేశాలతో..

  • ఊర చెరువుకు టెంపరరీ రిపేర్లు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం బొక్కలగుట్టలోని ఊరచెరువు మత్తడి వద్ద కట్ట తెగిపోయే ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ఆదివారం రిపేర్లు చేపట్టారు. చెరువు తూము పక్కన పెద్ద బుంగ పడిందని, కట్టతెగిపోయి ప్రమాదం ఉందని గ్రామస్తులు ఫోన్​లో ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్​ ఆఫీసర్లకు రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు.

ఇరిగేషన్​డీఈ శారద, ఏఈ రమ్య, వర్కింగ్​ఇన్​స్పెక్టర్​చంద్రమౌళి, పంచాయతీ సెక్రటరీ విద్యాలత పర్యవేక్షణలో చెరువు తూము వద్ద కట్టకు పడిన బుంగను మట్టితో నింపారు. వందలాది ఇసుక బస్తాలను అడ్డుగా వేసి టెంపరరీ రిపేర్లు చేశారు.

గ్రామస్తులు సహకారం అందించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన ఫండ్స్​కోసం రిపోర్టులు రెడీ చేయాలని సంబంధితా ఆఫీసర్లను ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశించారు.