యూఎస్ కంపెనీలో రిలయన్స్‌‌‌‌కు 45 శాతం వాటా

న్యూఢిల్లీ : యూఎస్ కంపెనీ హెల్త్‌‌‌‌ అలయన్స్ గ్రూప్‌‌‌‌ ఐఎన్‌‌‌‌సీలో 45 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ డిజిటల్ హెల్త్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ద్వారా  ఈ వాటాలను  కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ 10 మిలియన్ డాలర్లు (రూ.85 కోట్లు).

డయాగ్నోస్టిక్ సర్వీస్‌‌‌‌లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందించడానికి, హెల్త్‌‌‌‌కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో మరింతగా విస్తరించడానికి తాజా డీల్ సాయపడుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఇంకో రెండు వారాల్లో  డీల్ పూర్తవుతుందని తెలిపింది.