రిలయన్స్​ చేతికి కార్కినోస్​ హెల్త్​కేర్​

  • డీల్​ విలువ రూ.375 కోట్లు

న్యూఢిల్లీ: అంకాలజీ సేవలు అందించే కార్కినోస్​హెల్త్​కేర్​ను ముకేశ్​అంబానీకి చెందిన రిలయన్స్​గ్రూపు కొనుగోలు చేసింది. ఈ డీల్​ విలువ రూ.375 కోట్లని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్​ స్ట్రాటెజిక్​ బిజినెస్​ వెంచర్స్​(ఆర్​ఎస్​బీవీఎల్) కార్కినోస్​ షేర్లను ఈ నెల 27న కొన్నదని రిలయన్స్​  ఎక్స్ఛేంజ్​  ఫైలింగ్​లో  తెలిపింది.

 2020 జులైలో ఏర్పాటైన కార్కినోస్​ క్యాన్సర్​ నిర్ధారణ, నియంత్రణ సేవలు అందిస్తుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దీని టర్నోవర్​ రూ.22 కోట్లు. గత డిసెంబరు నాటికి ఇది 60 హాస్పిటల్స్​తో క్యాన్సర్​గుర్తింపు సేవల ఒప్పందం కుదర్చుకుంది.