ఆస్పత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య కారణాల వల్ల అస్వస్థకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శక్తికాంత దాస్ కు వైద్య పరీక్షలు చేశారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.  అసిడిటీ కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని.. మరో రెండు మూడు గంటల్లో  డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.