న్యూఢిల్లీ: యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.5 వేల కు ఆర్‌బీఐ పొడిగించింది. ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్టంగా రూ.1,000 వరకు పంపుకోవచ్చు. యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్లను ఆఫ్‌లైన్‌లో జరుపుకోవచ్చు. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్‌ఏ) అవసరం ఉండ దు. ప్రస్తుతం ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్టంగా రూ.500 వరకు, మొత్తంగా రూ.2,000 లకు మించి పంపుకోవడానికి కుదరదు.
ట్రాన్సాక్షన్ అలర్ట్స్ కూడా వెంటనే మొబైల్ ఫోన్లకు వెళ్లవు. ప్రస్తుతం యూపీఐ లైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఆన్‌లైన్ పేమెంట్స్ జరిగేలా చూడడానికి రిజర్వ్ బ్యాంక్ ‘ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్’ కు కొన్ని సవరణలు చేసింది.