రైతులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఈజీగా వ్యవసాయ రుణాలు

  • మందగించిన ఎకానమీ.. మరోసారి వడ్డీ రేట్లు మారలే
  • ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ అంచనాలు పెంచిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ
  • జీడీపీ గ్రోత్ అంచనాలు డౌన్‌‌‌‌‌‌‌‌
  • సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు..బ్యాంకులకు ఊరట

న్యూఢిల్లీ: జీడీపీ గ్రోత్ పడిపోవడం, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ వరుసగా 11 వ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు.  కానీ, బ్యాంకులు మెయింటైన్ చేయాల్సిన క్యాష్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ రేషియో (సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్) ను తగ్గించింది. దీంతో లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు దగ్గర ఫండ్స్ పెరుగుతాయి. మందగిస్తున్న ఎకానమీకి సపోర్ట్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా 11 వ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ రెపో రేటును 6.5 శాతం దగ్గర కొనసాగించింది. రేట్లను యధాతథంగా కొనసాగించాలని ఆరుగురు మెంబర్లు ఉన్న కమిటీలో నలుగురు ఓటేశారు.  మానిటరీ పాలసీ విధానాన్ని ‘న్యూట్రల్‌‌‌‌‌‌‌‌’ గా ఉంచాలని నిర్ణయించారు. మరో ఇద్దరు మెంబర్లు మాత్రం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడానికి మొగ్గు చూపారు.

 సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ బేస్ చేసుకొని డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ దగ్గర  బ్యాంకులు డిపాజిట్ చేస్తాయి. ఈ సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో ఇది 4 శాతానికి దిగొచ్చిందన్నారు. ఈ నెల 14, 28 న  రెండు దశల్లో ఇది అమల్లోకి వస్తుంది. సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ తగ్గించడంతో బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థలోకి రూ.1.16 లక్షల కోట్లు వస్తాయని అంచనా. దీంతో బ్యాంకుల డిపాజిట్ రేట్లపై ఒత్తిడి తగ్గుతుంది. 

2024–25లో జీడీపీ గ్రోత్ 6.6 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  జీడీపీ 6.6 శాతం వృద్ధి చెందుతుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ అంచనా వేస్తోంది. గతంలో వేసిన అంచనా 7.2 శాతం నుంచి తగ్గించింది. జీడీపీ గ్రోత్  ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తక్కువగా రికార్డయ్యిందని దాస్ అన్నారు.  పంటల దిగుబడి పెరుగుతుందని, పండుగ ఖర్చులతో జీడీపీ పుంజుకుంటుందని  పేర్కొన్నారు.  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ అంచనాలను కూడా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ పెంచింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 4.8 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఈ నెంబర్ 4.5 శాతంగా రికార్డవుతుందని గతంలో అంచనా వేసింది. కాగా, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ 4 శాతానికి పైనే నమోదవుతోంది.  ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 14 నెలల గరిష్టమైన 6.21 శాతానికి చేరుకుంది. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ తగ్గితేనే వడ్డీ రేట్లకు కోత పెడతామని  దాస్  అన్నారు.

ఈజీగా వ్యవసాయ రుణాలు​ 

ఎటువంటి కొలేటరల్ లేకుండా రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను ఇవ్వడానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ అనుమతిచ్చింది. గతంలో రూ.1.6 లక్షల వరకు మాత్రమే ఇటువంటి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులకు వీలుండేది. ముందుగానే మంజూరు చేసిన లోన్లు యూపీఐ  ద్వారా ఇచ్చేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు వీలు కలిగింది. ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఏఐని బాధ్యతాయుతంగా వాడేందుకు ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డెవలప్ చేయనుంది.

 ఇందుకోసం ఓ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది. డిసెంబర్ 10తో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శక్తి కాంత దాస్ పదవీ కాలం ముగుస్తుంది. ఆయనికిది రెండో టెర్మ్‌‌‌‌‌‌‌‌. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ వడ్డీ రేట్లను తగ్గించాలని కోరినా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పట్టించుకోలేదు. దాస్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందో లేదా చూడాలి. తదుపరి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్ ఫిబ్రవరి 5–7, 2025 న జరుగుతుంది.