పీర్ల తయారీకి .. రేగోడ్​ ఫేమస్​

రేగోడ్, వెలుగు: పూర్వీకుల త్యాగానికి గుర్తుగా ముస్లింలు మొహర్రం పండగ జరుపుకొంటారు. మొహర్రం అనగానే టక్కున గుర్తుకొచ్చేది పీర్లు. ఈ పండగ సందర్భంగా గ్రామాల్లో పీర్లను ప్రతిష్ఠిస్తారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన  రేగోడ్​ పీర్ల తయారీకి ఫేమస్​. ఇత్తడితో పీర్లు తయారు చేయడంలో ఈ గ్రామానికి  ప్రత్యేక గుర్తింపు ఉంది.

 ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక నుంచి సైతం ఇక్కడికి వచ్చి పీర్లను తయారు చేయించుకుని వెళ్తారు. మొహర్రం సమీపిస్తుండడంతో పీర్ల తయారీ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాము తయారు చేసే పీర్లను సోషల్​ మీడియాలో పెట్టడంతో కొత్త గిరాకీలు వస్తున్నాయని మెతుకు సుధాకర్ చారి తెలిపారు.