రెసిడెన్షియల్ స్కూల్​లో స్టూడెంట్స్​ను కరిచిన ఎలుకలు

  • మెదక్​జిల్లా రామాయంపేటలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి..  

రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ ​వెల్ఫేర్ ​గర్ల్స్ రెసిడెన్షియల్​స్కూల్​లో స్టూడెంట్స్​ను ఎలుకలు కరిచాయి. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ శివారులోని కాళ్లగడ్డ ప్రాంతంలో టీజీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 600 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. మూడు రోజుల కింద హాస్టల్​లో స్టూడెంట్స్​ నిద్రిస్తున్న సమయంలో 9 మందిని ఎలుకలు కరిచాయి.ఈ విషయాన్ని స్టూడెంట్స్.. ​రెసిడెన్షియల్​ స్టాఫ్​కు తెలపగా వారు విషయాన్ని బయటకు రానివ్వలేదు.

బుధవారం పేరెంట్స్ స్కూల్​కు రావడంతో విషయం బయటపడింది. దీంతో వారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రీట్ మెంట్ కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి ట్రీట్ మెంట్ చేయించారు. దీనిపై ఇన్​చార్జి ప్రిన్సిపాల్​పద్మ వివరణ కోరగా ‘హాస్టల్​గదిలో ఒకటే ఎలుక ఉంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. పిల్లలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేయించాం’ అని బదులిచ్చారు.  అయితే, హాస్టల్ ​ప్రాంగణంలోని చెత్త, అపరిశుభ్రత వల్లే ఎలుకలు చేరుతున్నాయని తెలుస్తోంది.