నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి నదీ పరివాహకంలో బోధన్ రాష్ట్రకూటులకు సంబంధించిన మూడు రాగి ఫలకాలు దొరికాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి, వరంగల్ ఎపీగ్రఫీ డైరెక్టర్ రాగి వైకుంఠ చారి తెలిపారు. రాష్ట్రకూటుల శాసనాలకు సంబంధించిన ఈ శిలాఫలకాలపై కాళ్లతో కూర్చున్న గరుడ చిత్రం ఉందన్నారు.
ఈ శాసనాలు సంస్కృతం, నాగరి భాషలో ఉన్నాయన్నారు. గోవింద, కరక, ఇంద్ర, దంతిదురగ, మొదటి కృష్ణుడు 776, క్రీస్తు శకం 774 నుంచి రాష్ట్ర కూట రాజవంశ కావలి వివరాలు పొందుపరిచారన్నారు. ఓ బ్రాహ్మణుడికి గ్రామం బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో నమోదు చేశారన్నారు. రాగి పలకను తారదేవ చెక్కారని ఇది బహుశా మొదటి రాగి శిలాఫలకమన్నారు.