ఆసిఫాబాద్‌ అడవుల్లో అరుదైన వైల్డ్ డాగ్స్ (VIDEO)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి కుక్కలు ఫారెస్ట్ అధికారుల కంట పడ్డాయి. అంతరించిపోతున్న ఈ ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్‌ తాజాగా పెంచికల్‌ పేట్‌ అడువుల్లో కనిపించాయి. కమ్మర్గాం , మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలో మూడు అడవి కుక్కలు చెరువులో నీరు తాగుతున్నాయి. అటుగా వెళ్తున్న యువకులు వాటిని చూసి వీడియో తీశారు. పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో సుమారుగా 5-10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. కానీ అవి ఎప్పుడూ సామాన్యుల కంట పడవు. ఇవి పులులను సైతం ఎదిరిస్తాయట. స్పీడ్, ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండటం వీటి లక్ష్యం.