నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళపై అత్యాచారం

నిర్మల్, వెలుగు: భర్తతో గొడవపడి బయటకు వచ్చి, ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మంజులాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో గొడవ పడి శుక్రవారం రాత్రి నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. అక్కడ యోగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి పరిచయం కావడంతో తనకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పింది. దీంతో అతడు తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విషయం చెప్పాడు. అతడు బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి మహిళను ఓ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మహిళ అక్కడి నుంచి తిరిగి బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి అక్కడే ఉన్న ఓ ఆటోలో కూర్చొని స్పృహ తప్పింది. 

ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంటనే అక్కడే ఉన్న కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విషయం చెప్పాడు. అతడు మహిళను స్థానిక గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించాడు. శనివారం ఉదయం మహిళ కోలుకోవడంతో ఆమె నుంచి వివరాలు సేకరించారు. మహిళ ఫిర్యాదుతో కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకీ షర్మిల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకొని మహిళను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, అవసరమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలో పర్యటించి వివరాలు సేకరించారు.