మార్కెట్లోకి సబల మిల్లెట్​ ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు: రామోజీ గ్రూపు సబల బ్రాండ్​ పేరుతో మిల్లెట్స్ (తృణధాన్యాలు) ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  వీటిలో కిచిడీ, మిల్లెట్ కుకీలు, హెల్త్ బార్స్, మంచ్, నూడుల్స్ వంటి 45 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ధరలు రూ.75 నుంచి మొదలవుతాయి. ప్రస్తుతం తమ వెబ్​సైట్​ద్వారా వీటిని అమ్ముతున్నామని, త్వరలో రిటైల్​స్టోర్లలో లభిస్తాయని సబల డైరెక్టర్​సహరి చెరుకూరి చెప్పారు. 

ఈ ఆహార పదార్థాలలో కృత్రిమ రసాయనాలు వినియోగించలేదని, పూర్తిగా సహజ సిద్ధంగా తయారు చేశామని పేర్కొన్నారు. ప్రియా ఫుడ్స్​తయారీ యూనిట్లలోనే వీటినీ ఉత్పత్తి చేస్తున్నామని సహరి వివరించారు.