మా ఊళ్లకు బస్సులు వేయండి .. డిపో మేనేజర్ కు గ్రామస్తుల వినతి

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ గ్రామాలకు బస్సులు నడిపించాలని కోరుతూ రాజాపేట మండలం నర్సాపూర్, కొమురవెల్లి మండలంలోని రాం సాగర్ గ్రామ ప్రజలు మంగళవారం సిద్దిపేట జిల్లా బస్ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సిద్దిపేట నుంచి కొమురవెల్లి, రాం సాగర్, రాజా పేట, జగదేవ్ పూర్ మీదుగా ఈసీఐఎల్ వరకు బస్ నడిపించారన్నారు.

ఈ మధ్యలో బస్ సేవలు నిలిచిపోయాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి బస్​సేవలను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో గోపిరెడ్డి, ఉప్పలయ్య గౌడ్, మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, భాస్కర్, రాజిరెడ్డి, శ్రీను, ప్రకాశ్, భాను, నర్సింహులు, మహేందర్, కొండల్ పాల్గొన్నారు.