పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : సందీప్ కుమార్ ఝా

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు:ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా కొనసాగుతోందని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు మండలంలోని పోతుగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్వే తీరును కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శనివారం పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దరఖాస్తుదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేస్తున్నారని వివరించారు.

సర్వేకు వచ్చే అధికారులకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. అంతకుముందు తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంగన్వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ భాస్కర్, డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవో నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీవో బీరయ్య, ఆయా శాఖల అధికారులు  పాల్గొన్నారు