పాఠాలు చెప్పిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ కుమార్ ఝా

వేములవాడ, వెలుగు: -వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీని రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ కుమార్ ఝా గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలేజీలోని తరగతి గదులు, టాయిలెట్స్, కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు.

పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు. కాలేజీకి కావాల్సిన సౌకర్యాలపై రిపోర్టు తయారుచేసి ఇవ్వాలని, ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోద్ రెడ్డి, లెక్చరర్లు, సిబ్బంది ఉన్నారు.