తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ .. క్షమాపణ చెప్పాలె : ఎమ్మెల్యే హరీష్ రావు

మహిళలకు రూ.2500 ఇచ్చామని రాహుల్ గాంధీ అంటున్నారని అ  డబ్బులు తీసుకున్న వారంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని..తీసుకొని వారంతా బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.  రాహుల్ గాంధీ కొత్త హామీలు ఇచ్చేముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్.  ఢిల్లీలో తెలంగాణ హక్కులు కాపాడాలంటే ప్రశ్నించే గొంతుక గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు.  గత బీఆర్ఎస్ హయాంలో జహీరాబాద్ పట్టణానికి రూ.150 కోట్ల రూపాయలను మంజూరు చేసి అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లామని గుర్తుచేశారు. వంద కాదు  రెండు వందల రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టే  ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్లు దేవుళ్ల మీద ఓట్లు వేస్తున్నారని హరీష్ విమర్శించారు.