హైదరాబాద్, వెలుగు:లైటింగ్, సైనేజ్ సెక్టార్లలో మొదటిసారిగా 36వోల్ట్స్ ఎల్‌ఈడీ మాడ్యుల్‌ను క్వాట్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది. ఈ ప్రొడక్ట్‌ను ఆదివారం లాంచ్ చేసింది. 10 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది.36వీ ఎల్‌ఈడీ మాడ్యుల్‌తో కరెంట్ ఆదా అవుతుందని, ఎక్కువ కాలం పనిచేస్తుందని క్వాట్ టెక్నాలజీస్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. వాట్‌కు 185 లుమెన్స్ (బ్రైట్‌నెస్) వెలుగునిస్తుందని తెలిపింది.
ఐపీ67 రేటింగ్‌తో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ప్రొటక్షన్ ఉంటుందని, బ్రైట్‌నెస్ ఎక్కువ కాలం ఉంటుందని తెలిపింది. అలానే 36 వీ ఎల్‌ఈడీ మాడ్యుల్‌ను మెయింటైన్ చేయడం ఈజీ అని పేర్కొంది. తమ ప్రొడక్ట్‌తో కరెంట్ వాడకం 50 శాతం తగ్గుతుందని కంపెనీ ఫౌండర్ ప్రేమ్నాథ్ పరాయత్ అన్నారు.