క్వాలిజీల్ కొత్త ప్రొడక్ట్​..క్యుమెంటిస్ ఏఐ

హైదరాబాద్, వెలుగు : క్వాలిటీ ఇంజినీరింగ్ (క్యుఈ) కంపెనీ క్వాలిజీల్ ఇటీవల క్యుఈ కాంక్లేవ్ 2024 పేరుతో నిర్వహించిన రెండో ఎడిషన్​లో  ఏఐ - శక్తితో కూడిన క్వాలిటీ ఇంజనీరింగ్ టూల్ క్యుమెంటిస్ ఏఐని ఆవిష్కరించింది. “ఏఐ - పవర్ క్వాలిటీ ఇంజినీరింగ్ : విజన్ ఫర్ 2025  అంతకు మించి” 

అనే నేపథ్యంతో నిర్వహించిన ఈ సదస్సుకు 600 మందికిపైగా మంది పరిశ్రమల నాయకులు, మధ్య స్థాయి నిపుణులు వచ్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి, సాంకేతిక రంగంలో రాణించడం గురించి కీలకోపన్యాసాలు, ప్రెజెంటేషన్‌‌‌‌లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ చర్చలు జరిగాయి.