జనవరి 7 నుంచి క్వాడ్రంట్​ ఐపీఓ

న్యూఢిల్లీ :  క్వాడ్రంట్​ ఫ్యూచర్​ టెక్ ​లిమిటెడ్ ​ ఐపీఓ జనవరి ఏడో తేదీన మొదలై తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ప్రైస్​ బ్యాండ్​ను రూ.275–290 మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. యాంకర్​ ఇన్వెస్టర్ల బిడ్డింగ్​ఈ నెల ఆరో తేదీన ఉంటుంది. ఇన్వెస్టర్లు కనీసం 50 ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో రూ.290 కోట్ల ఫ్రెష్​ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్ ​పోర్షన్ ​ఉండదు. 

ఐపీఓ ద్వారా వచ్చిన రూ.149.72 కోట్లను లాంగ్​టర్మ్​ వర్కింగ్​ క్యాపిటల్​అవసరాల కోసం కేటాయిస్తారు. మరో రూ.24.37 కోట్లు ఎలక్ట్రిక్​ ఇంటర్​ లాకింగ్ ​సిస్టమ్​ డెవెలప్​మెంట్​ కోసం, రూ.23.62 కోట్లను అప్పుల చెల్లింపు కోసం, సాధారణ కార్పొరేట్​అవసరాల కోసం వాడతారు. రీసెర్చ్​కంపెనీ అయిన క్వాడ్రంట్​ న్యూ జెనరేషన్​ ట్రెయిన్  ​కంట్రోల్​, సిగ్నలింగ్​ సిస్టమ్​లను ఇండియన్​రైల్వే కవచ్ ​ప్రాజెక్ట్​ కోసం తయారు చేస్తుంది. ఐపీఓ షేర్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్ట్​ అవుతాయి.