రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని నిర్వహించారు.
అంతకుముందు స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రదర్శించిన మక్త వెంకటాపురం కళాకారులు జడ కొప్పు కళా ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి అలంకరణలతో వచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఫలహార బండ్ల పదర్శన నిర్వహించారు.