ఆదిలాబాద్​ జిల్లాలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు

 ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : ఆదిలాబాద్​లోని జిల్లా పరిషత్ మీటింగ్​హాల్​లో శుక్రవారం రాత్రి  ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​శ్యామలాదేవి, డీసీసీబీ చైర్మన్​అడ్డి భోజారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై కళాకారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కాంగ్రెస్​ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు రుణ మాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్య, వరిధాన్యం కొనుగోలు, డ్వాక్రా, ఇందిరమ్మ ఇళ్లు,  మహిళలకు రూ 500/- కే గ్యాస్ సిలిండర్,  గృహ జ్యోతి పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్, ట్రైనీ కలెక్టర్ అభీగ్యాన్ మాలవీయ, ఆర్డీవో వినోద్ కుమార్,  జడ్పీ సీఈవో  జితేందర్ రెడ్డి, డీవైఎస్​ వెంకటేశ్వర్లు, డీపీఆర్​వో తిరుమల, పర్యాటకశాఖ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.‌‌