దండేపల్లి, వెలుగు : సర్వ శిక్షా అభియాన్, కస్తుర్బా విద్యాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం దండేపల్లి ఎమ్మార్సీలో పీఆర్టీయూ టీఎస్ 2025 క్యాలెండర్ ను అయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ఉద్యోగులు, టీచర్లకు 50 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించి పెండింగ్లో ఉన్న డీఏలు, జీపీఎఫ్ టీఎస్జీఎల్ఐ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.
కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రావెనవేని రవి, మల్యాల మల్లేశ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండు జనార్దన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అప్పాల మనోహర్, వరలక్ష్మి, పాత రమేశ్, తిరుపతి, నక్క విజయ చందర్ తదితరులు పాల్గొన్నారు.