బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్‎లో ప్రొటోకాల్ రగడ

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రోగ్రామ్‎లో ప్రొటోకాల్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అధికారులతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. సంగారెడ్డి జిల్లా హత్నూరలో గురువారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా..  మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని బీజేపీ నేతలు అధికారులను నిలదీశారు. మరోవైపు అర్హత లేని బీఆర్ఎస్ నేతలను ప్రోగ్రాంకు ఎందుకు పిలిచారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణ, మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా.. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని.. ప్రొటోకాల్ ఎలా పాటించాలో తమకు తెలుసని.. ఇకముందు విస్మరించకుండా అందరికి సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.