రోడ్లపై నాట్లు వేసి నిరసన

కుంటాల, వెలుగు : కుంటాల మండలంలోని లింబా కే గ్రామంలో ప్రధాన రహదారి వర్షాలకు పాడైంది. ఈ మార్గం గుండ నడవడం ఇబ్బందిగా మారింది. స్థానికులు అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో యువకులు శనివారం బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డును బాగుచేయాలని కోరారు.