- ఆర్గనైజర్‌తో పాటు ఐదుగురు విటుల అరెస్ట్
- సోషల్ మీడియా ద్వారా మహిళలకు వల వేస్తున్న నిర్వాహకుడు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఎల్ఐసీ ఆఫీసు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో రెండు నెలలుగా వ్యభిచారం నడుస్తోంది. పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి ఆర్గనైజర్‌తో పాటు ఐదుగురు విటులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ ప్రకాశ్, సీఐ బన్సీలాల్కథనం ప్రకారం.. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన కరుణాకర్ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నాడు. బెల్లంపల్లికి చెందిన శాతాని శంకర్‌ను మేనేజర్‌గా నియమించాడు.
శంకర్ సోషల్ మీడియా ద్వారా అందమైన మహిళలకు వల వేసి షార్ట్ ఫిలిమ్స్‌లో చాన్స్ ఇస్తామని పిలిపించి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. మంగళవారం కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను ఇలాగే పిలిపించాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పలువురు విటులకు షేర్ చేసి గెస్ట్‌హౌస్‌కు రప్పించాడు. వారితో గడిపితే షార్ట్‌ఫిలిమ్స్‌లో చాన్స్ఇస్తా రని చెప్పడంతో అందుకు ఒప్పుకుంది. శంకర్ ఒక్కొక్కరి దగ్గర రూ.2వేలు వసూలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి గెస్ట్ హౌస్‌పై దాడిచేసి శంకర్‌తో పాటు విటులు కొప్పర్తి నవీన్(బెల్లంపల్లి)
దేవ పోచమల్లు, గండి రమేశ్(రామకృష్ణాపూర్), కొలిపాక రాజశేఖర్(మంచిర్యాల హమాలివాడ), గొల్లపల్లి శేఖర్(సీసీసీ నస్పూర్)ను అరెస్టు చేశారు. బాధితురాలిని సఖి సెంటర్‌కు తరలించి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో పాత్ర వహించిన గెస్ట్‌హౌజ్ నిర్వాహకుడు కరుణాకర్‌ను సైతం అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు.