హైదరాబాద్‌‌‌‌లో పెరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు.. ఎంత కాస్ట్ ఉండే ఇండ్లను ఎక్కువగా కొంటున్నారంటే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో రూ.3,617 కోట్ల విలువైన 5,985 ఇండ్లు రిజిస్టర్ అయ్యాయని నైట్‌‌‌‌ఫ్రాంక్‌‌‌‌  రిపోర్ట్ పేర్కొంది. ఇండ్ల విలువ  కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 14 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే రిజిస్టర్ అయిన ఇండ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 2 శాతం,  నెల ప్రాతిపదికన 20 శాతం పెరిగింది.

రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ విలువుండే ఇండ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయని నైట్‌‌‌‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయిన ఇండ్లలో ఈ సెగ్మెంట్ వాటా 14 శాతానికి పెరిగిందని తెలిపింది. రూ.కోటి కంటే ఎక్కువ విలువుండే ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఏడాది ప్రాతిపదికన 36 శాతం వృద్ధి చెందాయని  వివరించింది. రూ.50 లక్షల కంటే తక్కువ విలువుండే ఇండ్ల సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కిందటి నెలలో జరిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 59 శాతంగా రికార్డయ్యింది.