ఆహారం డిమాండ్ పెరుగుతోంది.. తక్కువ వనరులతో ఎక్కువ పండించాలి: ప్రొఫెసర్​ప్రవీణ్రావు

హైదరాబాద్, వెలుగు: తక్కువ వనరులతో ఎక్కువ ఆహార ధాన్యాలను  ఉత్పత్తి చేయాలని కావేరీ యూనివర్సిటీ వైస్​–చాన్స్​లర్​ ​ప్రవీణ్​రావు అన్నారు.  హైదరాబాద్​లో బయో అగ్రి ఇన్‌‌పుట్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్వహించిన  బయో అగ్రి 2024 సదస్సులో ఆయన మాట్లాడుతూ 1960 నుంచి 2023 వరకు  భారతీయ వ్యవసాయం రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.  వ్యవసాయ- ఎగుమతులు 53.15 బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు. 

మనదేశానికి 550 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందన్నారు. అయితే 2010 నుంచి 2050 వరకు ఆహార డిమాండ్ 71 శాతం పెరిగిందని చెప్పారు. సాగురంగం అసాధారణ వాతావరణం సహా ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటోందని రావు వివరించారు. ఇప్పుడు ఆహార పోషణ భద్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.   రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవిదేశాలకు చెందిన 250 మంది ప్రతినిధులు  పాల్గొంటున్నారు.