మెదక్ జిల్లాలో చకచకా టీచర్ల ప్రమోషన్లు

  • లాంగ్వేజ్​ పండిట్స్​ సర్టిఫికేట్​వెరిఫికేషన్​పూర్తి ​ 
  • ఈ నెల 22 లోగా ప్రాసెస్ ​కంప్లీట్​కి చర్యలు

మెదక్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్స్​ ప్రమోషన్స్, ట్రాన్స్​ఫర్స్​​ ప్రాసెస్​ చకచకా కొనసాగుతోంది. ప్రమోషన్​​కు అర్హులైన లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ, సెకండ్​ గ్రేడ్​ టీచర్స్​(ఎస్జీటీ)  సీనియారిటీ జాబితాను తయారు చేశారు. లాంగ్వేజ్​ పండిట్ల సర్టిఫికేషన్​ వెరిఫికేషన్​ ప్రాసెస్​ పూర్తయింది. విద్యాశాఖ నిర్దేశిత షెడ్యూల్​ ప్రకారం ఈనెల 22 లోగా ట్రాన్స్​ఫర్స్, ప్రమోషన్స్​ ప్రాసెస్​ కంప్లీట్​ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

జిల్లాలోని 21 మండలాల పరిధిలో 623 ప్రైమరీ, 128 అప్పర్​ ప్రైమరీ, 146 జడ్పీ హైస్కూల్స్​ ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ లో ట్రాన్స్​ఫర్​ అయి ఇప్పటి దాకా అదే స్కూళ్లలో ​కొనసాగిన  560 మంది స్కూల్​అసిస్టెంట్లు ఇటీవల రిలీవ్​అయి కొత్తగా పోస్టింగ్​ లభించిన స్కూళ్లలో​ జాయిన్​అయ్యారు. 

ప్రమోషన్​ కు అర్హులు 674 మంది

జిల్లాలో ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న 674 మంది టీచర్స్​ను ప్రమోషన్​కు అర్హులుగా గుర్తించారు. వారిలో ఎల్ఎఫ్​ఎల్​హెచ్ఎంలు 124 మంది, పీఎస్​హెచ్ఎంలు నలుగురు, లోకల్​ బాడీ, గవర్నమెంట్​ స్కూళ్లలో పనిచేసే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం టీచర్స్​ కలిపి బయోసైన్స్​11 మంది, ఇంగ్లీష్​ ఇద్దరు, హిందీ 129 మంది,  మ్యాథ్స్​143 మంది,  ఫిజికల్​ ఎడ్యుకేషన్​ 94 మంది, సోషల్​ఐదుగురు, తెలుగు 160 మంది, ఉర్దూ ఒకరు ఉన్నారు.  కాగా సబ్జెక్ట్​ ల వారీగా ప్రమోషన్ కు అర్హత సాధించే పోస్టులు 593 మాత్రమే ఉన్నాయి. అర్హులైన టీచర్లు ఎక్కువ మంది ఉండగా, పోస్టులు తక్కువగా ఉండడంతో అందరికి ప్రమోషన్స్​లభించే అవకాశం లేదు. సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్స్​లభించే ఛాన్స్​ఉంది. 

ఆన్​లైన్​లోనే..

టీచర్స్​ ప్రమోషన్స్​, ట్రాన్స ఫర్స్​ ప్రాసెస్​ అంతా ఆన్​లైన్​ సిస్టంలోనే జరుగుతోందని డీఈవో రాధాకిషన్​ తెలిపారు. లాంగ్వేజ్​ పండిట్స్, ఎస్జీటీ నుంచి స్కూల్​ అసిస్టెంట్​ ప్రమోషన్స్​ ప్రక్రియ పూర్తయ్యాక టీచర్​ పోస్టుల ఖాళీలపై క్లారిటీ వస్తుందన్నారు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 22 వరకు ఈ ప్రాసెస్​ పూర్తవుతుందని, ప్రమోషన్​ వచ్చిన, ట్రాన్స్​ఫర్​ అయిన టీచర్స్​ వెంటనే తాము నియమాకం అయిన స్కూళ్లలో​జాయిన్​ కావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.