ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌‌‌‌ మ్యుటేషన్‌‌‌‌ పేపర్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు : మ్యుటేషన్‌‌‌‌ చేసేందుకు గతంలో రూ. 50 వేలు తీసుకున్న ఓ తహసీల్దార్‌‌‌‌, పేపర్లు ఇచ్చేందుకు మరో రూ. 20 వేలు డిమాండ్‌‌‌‌ చేశాడు. రూ. 10 వేలు తీసుకుంటూ రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబట్టాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌‌‌‌ మండలానికి చెందిన రైతు కోడం తిరుపతి తన భూమి మ్యుటేషన్‌‌‌‌ కోసం ఆరు నెలల కింద అప్లై చేసుకున్నాడు. అయితే డబ్బులు ఇస్తేనే భూమిని మ్యుటేషన్‌‌‌‌ చేస్తానని కాల్వ శ్రీరాంపూర్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ జాహెద్‌‌‌‌ పాషా చెప్పాడు.

దీంతో రైతు తిరుపతి మూడు విడతల్లో రూ. 50 వేలను తహసీల్దార్‌‌‌‌ డ్రైవర్‌‌‌‌ అమ్జద్‌‌‌‌, వీఆర్‌‌‌‌వో ధర్మేందర్‌‌‌‌కు ఇచ్చాడు. అయినా భూమి మ్యుటేషన్‌‌‌‌ పూర్తి కాకపోవడంతో ఇటీవల ప్రజావాణిలో పెద్దపల్లి కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌‌‌‌ ఆదేశాలతో భూమి మ్యుటేషన్‌‌‌‌ పూర్తి అయింది. తర్వాత తహస్లీదర్‌‌‌‌ జాహెద్‌‌‌‌ పాషా రైతు తిరుపతికి ఫోన్‌‌‌‌ చేసి రూ. 20 వేలు ఇచ్చి పట్టా పేపర్లు తీసుకెళ్లాలని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రూ. 10 వేలు ఇస్తానని రైతు చెప్పడంతో తహసీల్దార్‌‌‌‌ ఒప్పుకున్నాడు.

అనంతరం తిరుపతి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనతో తిరుపతి శనివారం తహసీల్దార్‌‌‌‌కు డబ్బులు ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ ఆఫీసర్లు తహసీల్దార్‌‌‌‌ జాహెద్‌‌‌‌ పాషాను రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌‌‌‌తో పాటు అతడికి సహకరించిన వీఆర్‌‌‌‌వో ధర్మేందర్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ అమ్జద్‌‌‌‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని కరీంనగర్‌‌‌‌ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.