నిర్మల్ జిల కుబీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాలో తీవ్ర విషాదం నెలకొంది. డెలివరీ కోసం బైంసా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన గర్బిణీ సహా పసికందు మృతి చెందారు. పురిటి నొప్పులు రావటంతో..బహ్మమేశ్వర్ తండాకు చెందిన గర్బిణీ శీతల్ ను బైంసా హాస్టిటల్ కు తీసువచ్చారు కుటుంబీకులు.
నార్మల్ డెలివరీ డాక్టర్లు వేచిచూడటం వల్లే గర్బిణీ సహా పసికందు మృతిచెందినట్లు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. డెవవరీకోసం హాస్పిటల్ వస్తే..తల్లీబిడ్డ చనిపోవటంపై కన్నీమున్నీరవుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.