కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కనబడుట లేదు

  • బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో పోస్టర్లు

గజ్వేల్, వెలుగు : గజ్వేల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కనబడడం లేదంటూ బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో పోస్టర్లు అతికించారు.‘గజ్వేల్‌‌‌‌‌‌‌‌ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి ఇప్పటివరకు నియోజకవర్గానికే రాలేదు, ఎక్కడా కనిపించడం లేదు.

ఎవరికైనా కనిపిస్తే గజ్వేల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలి, ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇస్తాం’ అంటూ పోస్టర్లు వేశారు. అనంతరం గజ్వేల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.