Post Office RD Scheme: పోస్టాఫీసు బెస్ట్ స్కీం..ప్రతి నెలా 5వేల పెట్టుబడి..చేతికి 8.5లక్షల రాబడి

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓల్డెస్ట్ సంస్థల్లో పోస్టాఫీసు ఒకటి. మొదట్లో పోస్ట్ డెలివరీ మాత్రమే చేసిన పోస్టాఫీసు క్రమంగా ఆర్థిక సేవలను అందించడం ప్రారంభించింది. ఇది బ్యాంకింగ్, బీమా, ఇన్వెస్ట్ మెంట్లు వంటి ఆర్థిక లావాదేవీల సేవలను అందిస్తోంది. డబ్బును ఆదా లేదా పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పొందాలనుకునే వారికోసం అనేక రకాల స్కీంలను అమలు చేస్తోంది. అందులో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం ఒకటి.

పోస్టాఫీసు ద్వారా నిర్వహించబడుతున్న ఈ ప్రభుత్వం చిన్న పొదుపు పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ స్కీంలో పెట్టుబడి మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీం లు పెట్టుబడికి భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తాయి. అటువంటి ప్రసిద్ధ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ RD. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10 ఏళ్లలో రూ.8 లక్షల కంటే ఎక్కువ నిధిని డిపాజిట్ చేయవచ్చు. 

ALSO READ | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి పోస్టాఫీసుల్లో సేవింగ్ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి.  వీటిలో బెస్ట్ వన్ రికరింగ్ డిపాజిట్ స్కీం. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. దీనిని 10 సంవత్సరాలకు కూడా పొడిగించుకోవచ్చు.  ఇటీవల ఈ పెట్టుబడిపై వడ్డీ రేటు కూడా 6.5శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు. 

కేవలం రూ.100తో ఖాతా తెరవవచ్చు

పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీంలో ఈజీగా తెరవవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడి రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమిత లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు పత్రంతో పాటు తమ పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌తో లోన్ సౌకర్యం

మీరు పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్‌లో ఖాతాను తెరిచి, ఏదైనా సమస్య కారణంగా దాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పథకంలో ప్రీ-మెచ్యూర్ క్లోజర్ సౌకర్యం కూడా ఇవ్వబడింది. మెచ్యూరిటీ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాను మూసివేయవచ్చు. ఇందులో రుణ సదుపాయం కూడా ఇస్తారు. అయితే ఖాతా ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉన్న తర్వాత డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు మాత్రమే రుణంగా తీసుకోవచ్చు. దాని వడ్డీ రేటు గురించి మాట్లాడితే మీరు పొందుతున్న వడ్డీ రేటు కంటే ఇది 2 శాతం ఎక్కువ.

నెలకు రూ.5వేలు.. పదేళ్లలో రూ.8.5లక్షలు రాబడి

పోస్ట్ ఆఫీస్ RDలో పెట్టుబడి,వడ్డీని లెక్కిస్తే ఈ పథకంలో ప్రతి నెలా రూ.5వేలు పెట్టుబడి పెడితే దాని మెచ్యూరిటీ వ్యవధిలో అంటే ఐదు సంవత్సరాలలో మొత్తం 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. దీనికి వడ్డీ రూ.56,830 జోడించబడుతుంది. వడ్డీ రేటు 6.7 శాతం. మీ మొత్తం ఫండ్ రూ.3,56,830 అవుతుంది. మీ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలనుకుంటే..10 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 6లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2లక్షల 54వేల272 అవుతుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వ్యవధిలో డిపాజిట్ చేయబడిన మీ మొత్తం ఫండ్ రూ. 8లక్షల54వేల 272 మీ చేతికి వస్తుంది. 

పోస్టాఫీసు RD స్కీం లలో పెట్టుబడిపై , సంపాదించిన వడ్డీపై  TDS ఉండదు. ITR క్లెయిమ్ చేసిన తర్వాత ఆదాయం ప్రకారం తిరిగి చెల్లించబడుతుంది. ఆర్డీపై వచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. RD పై వడ్డీ రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటే.. TDS తీసివేయబడుతుంది.