గీతా నేత ఒక్కటేనని ఎంపీగా ఉన్నప్పుడే చెప్పా..మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఉన్నప్పుడే గీతా నేత ఒక్కటేనని చెప్పానని, పద్మశాలీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హుస్నాబాద్ పద్మశాలి నగర్ లో 45 లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హల్ రీడింగ్ రూం కు శంకు స్థాపన చేసిన క్రమంలో పొన్నం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్ లో హుస్నాబాద్ కు మరింత సహకారం ఉంటుందని అన్నారు.

కమ్యూనిటీ హాల్, రీడింగ్ రూం నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు.నేతన్న బంధు కు సంబంధించి 30 కోట్లు నేతన్న బకాయిలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 1 ద్వారా నేతన్న ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పాఠశాలకు తదితర అవసరాలకు వినియోగించుకుంటామని అన్నారు.

Also Read :- న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది

హుస్నాబాద్ లో హాండ్లమ్స్ అండ్ టెక్స్ టైల్స్ తదితర అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేయాల్సిన అంశాల పై ప్రాజెక్ట్ తయారు చేయాలని అధికారులను కొకరినట్లు తెలిపారు.షెడ్ల నిర్మాణం ,మగ్గాలు చేనేత వర్గానికి సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి మీ ప్రపోజల్ ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి నేతకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వం తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.