మెదక్​పట్టణంలో ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​పట్టణంలో పాలిటెక్నిక్​ఎంట్రెన్స్​టెస్టు ప్రశాంతంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా కేంద్రంలోని 4 ఎగ్జామినేషన్​సెంటర్లను జిల్లా కో-ఆర్డినేటర్​, మెదక్​ మహిళా పాలిటెక్నిక్​ ప్రిన్సిపాల్​సువర్ణలత సందర్శించి పరీక్షల తీరును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంట్రెన్స్​ టెస్టుకు జిల్లా వ్యాప్తంగా 1,590 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1,462 మంది అభ్యర్థులు ఎగ్జామ్​ రాశారని 128 మంది ఆబ్సెంట్​అయ్యారని తెలిపారు. 

సంగారెడ్డి టౌన్: పట్టణంలో పాలిటెక్నిక్​ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు జరిగిన ప్రవేశ పరీక్షకు జిల్లా కేంద్రంలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,420 మంది స్టూడెంట్స్​హాజరు కావాల్సి ఉండగా 2,200 మంది పరీక్షలు రాశారు. 220 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయారు