ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలో పోలీసులు వారం రోజులుగా నిర్వహిస్తున్న నెంబర్ ప్లేట్ లేని వాహనాల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ట్రాఫిక్పోలీసులు నెంబర్ ప్లేట్లేని 50 వాహనాలను సీజ్ చేశారు. వారం రోజులుగా కొనసాగుతున్న తనిఖీల్లో మొత్తం 321 వెహికల్స్ను తాత్కాలికంగా సీజ్ చేసి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆధారంగా నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయించారు.
నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్కు జరిమానా విధించి విడిచిపెట్టారు. కావాలనే నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వారి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ ప్రణయ్ తెలిపారు. నెంబర్ ప్లేట్లు మార్చి తిరిగితే చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.