పత్తి చేనులో గంజాయి సాగు .. పట్టుకున్న పోలీసులు

జైనూర్, వెలుగు: జైనూర్​ మండలంలోని పత్తి చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాలు ప్రకారం.. గౌరి కోలాంగుడా గ్రామానికి చెందిన సీడం రాము తన పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. 

చేనులో 30 మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రామును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మొక్కల విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. గంజాయి అమ్మినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.