కుభీర్, వెలుగు: కుభీర్మండల కేంద్రంలో బుధవారం భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులు లభ్యమైనట్లు సమాచారం. తెలంగాణ చౌక్సమీపంలోని ఓ గదిలో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రవీందర్సిబ్బందితో కలిసి గోదాంలో తనిఖీలు చేపట్టారు. ఆరు సంచులను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ సంచుల్లో పాన్‌మసాలా ప్యాకెట్లు ఉన్నాయని, గుట్కా కాదని పోలీసులు చెబుతుండగా.. స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుభీర్‌కు చెందిన ఓ వ్యాపారి పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్లు దిగుమతి చేసుకొని చుట్టుపక్కల గ్రామాల్లోని కిరాణ, పాన్‌షాపులకు గుట్టుగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యాపారితో సయోధ్య కుదరడంతోనే పోలీసులు అసలు విషయం చెప్పడంలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది.