27 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 27 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రవీంద్రనగర్ వద్ద తనిఖీలు చేపట్టగా బాలాజీ అనుకోడ గ్రామా నికి చెందిన రౌతు శంకర్ బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం

అదేవిధంగా బూరేపల్లి గ్రామానికి చెందిన నక్క రవి,పెరుగు తిరుపతి బైక్​ల మీద అక్రమంగా తరలిస్తున్న 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఇస్లావత్ నరేశ్​ తెలిపారు. బొలెరో వాహనం, రెండు బైక్​లను సీజ్ చేసినట్టు తెలిపారు.