136 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

దుబ్బాక, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 136 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం నరేశ్ శుక్రవారం రాత్రి రేషన్​ బియ్యాన్ని గూడ్స్​ కంటైనర్​లో సిద్దిపేట మీదుగా మెదక్​ వైపు తరలిస్తున్నాడు. కంటైనర్​ దుబ్బాక మండలం మర్రికుంట శివారులోకి రాగానే అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి పక్కకు ఒరిగింది.

దీంతో ఓనర్​ మరో వాహనాన్ని తీసుకొచ్చి అందులోకి రేషన్​ బియ్యాన్ని లోడ్​ చేస్తుండగా ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కంటైనర్​ డోర్లు ఒపెన్​ చేసి చూడగా రేషన్​ బియ్యం దందా బయటికి వచ్చింది.

పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్​ సప్లై అధికారులకు అందజేశారు. రెండు గూడ్స్​ కంటైనర్లను సీజ్​ చేసి, కంటైనర్​ ఓనర్​, డ్రైవర్లను అరెస్ట్​ చేసినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. ​